మెదక్: కొల్చారం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండల పరిధిలోని తుంపాలకు చౌరస్తా వద్ద అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు నాలుగు షాపుల షట్టర్ పైకి లేపి లోనికి చొరబడిన దొంగలు దొరికి పాల్పడ్డారు. ఒక మొబైల్ షాప్లో మొబైల్ ఫోన్లు, కిరాణా షాపులలో కిరాణా వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.