నారాయణపేట పట్టణంలో దొంగతనాల నివారణ కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, ప్రధాన కూడళ్లలో అనుమానాస్పద వ్యక్తులను ఆధునిక పరికరాలతో తనిఖీ చేశారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకటేశ్వర్లు సూచించారు.