ATP: యాడికి మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్ల చోరీకి పాల్పడ్డారు. రైతులు గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, దేవనాత్ రెడ్డితోపాటు మొత్తం 20 బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు కట్ చేసుకుని వెళ్లినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.