TG: కామారెడ్డి భిక్కనూరులోని ర్యాగట్ల పల్లిలో జరిగిన యువకుని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అన్న రాజును అతని తమ్ముడు శివ కుమార్ హత్య చేసినట్లు విచారణలో తేలింది. రాజు తమ సమీప బంధువైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో కుటుంబ పరువుకు భంగం కలిగిందని శివ కోపంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితుడిని రిమాండ్కు తరలించారు.