AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. భావోద్వేగానికి గురికావొద్దని మంత్రికి సూచించారు. రాయచోటిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కాసేపట్లో సచివాలయానికి మంత్రి రానున్నారు. సీఎంతో ఆయన భేటీ కానున్నారు. కాగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో మంత్రి కన్నీరు పెట్టుకున్నారు.