BDK: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త వైకుంఠ ద్వార దర్శనం కోసం భద్రాద్రి క్షేత్రం ముస్తాబైంది. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, అద్భుతమైన పుష్ప అలంకరణలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.