ASR: చింతపల్లి మండలంలోని బయలుకించంగి గ్రామ శివారులలో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని సీఐ వినోద్ బాబు తెలిపారు. ఏఎస్పీ ఆదేశాలతో ఆదివారం ఎస్సైలు జీ. వీరబాబు, ఎం. వెంకటరమణ తమ సిబ్బందితో కలిసి కోడిపందాల శిబిరంపై దాడులు నిర్వహించగా, కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. 9 బైక్లు, 4 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నామన్నారు.