NDL: బనగానపల్లె మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి హుండీ లెక్కింపు సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో డీ. పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా దేవాదాయశాఖ పర్యవేక్షణ అధికారి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉదయం 8 గంటలకు హుండీ లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.