AKP: ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామానికి చెందిన 150 మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆదివారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఎలమంచిలి పార్టీ కార్యాలయంలో చేరిన వారందరికి ఎమ్మెల్యే కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా పార్టీలోకి చేరామన్నారు.