GDWL: ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేయనున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. రవి చంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం శుభ్రపరిచే పనులు చేపడుతున్నందున నీటి సరఫరా బంద్ ఉందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.