BHPL: మేడారం జాతరకు కాళేశ్వరం నుంచి నేరుగా RTC బస్సులు నడపాలని ప్రజలు మంత్రి శ్రీధర్ బాబును, అధికారులను కోరుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులు కాళేశ్వరం మీదుగానే మేడారం వెళ్తుంటారని.. ప్రస్తుతం నేరుగా బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాల్లో అధిక ఖర్చుతో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరారు.