ATP: బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో రూ. 40 లక్షలతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్కు ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం భూమిపూజ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ. 2.82 కోట్లతో 7 హెల్త్ క్లినిక్లను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు త్వరలో సంజీవని కార్డులు ఇస్తామన్నారు.