NLG: ప్రజా క్షేత్రంలో నిలబడి గెలుపొందిన వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని సూచించారు. నకిరేకల్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్ సర్పంచులు వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడారు.