TG: ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దివాలా తీసేలా చేసిందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు మిగిల్చి వెళ్లిందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసిందన్నారు. పాలన వ్యవస్థను అధ్వాన్నంగా చేసిందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని ప్రజలను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.