AP: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. DEC 31 నుంచి 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా TTD ఈవో అనిల్ సింఘాల్ మాట్లాడుతూ.. ‘మొదటి 3 రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారికి కేటాయించిన సమయంలో చేరుకోవాలి. టోకెన్లు లేని భక్తులను JAN 2 నుంచి 8 వరకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తాం’ అని పేర్కొన్నారు.