PDPL: మంథని మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం సాయంత్రం వెంకటాపూర్, ఆరెందా అడవి ప్రాంతంలో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం ఆరెందా అటవీ ప్రాంతం నుండి మానేరు గుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గత మార్చిలో కూడా పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.