E.G: రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ శనివారం కోరుకొండలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ మేరకు విద్య, వైద్యం, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాలకు సంబంధించి పలు సమస్యలపై ప్రజల వద్ద నుంచి పలు అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.