AKP: పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని అరికట్టేందుకు విరివిగా మొక్కలు నాటాలని ఎలమంచిలి కోర్టు జడ్జి రమేష్ పిలుపునిచ్చారు. ఎలమంచిలి పట్టణం ఖాళీ స్థలంలో జడ్జి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, ఎంపీపీ శేషు శనివారం మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.