ఈ నెల 29, 30 తేదీల్లో జరగబోవు వైకుంఠ ఏకాదశికి ప్రముఖ మట్లపల్లి పుణ్యక్షేత్రం ముస్తాబవుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్లతో పాటు గ్రామ సర్పంచ్ అప్పారావు మంత్రి ఉత్తమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వనించారు. మంత్రి ఉత్తమ్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.