NLR: వలేటివారిపాలెం మండలం కూనిపాలెం టోల్ ప్లాజా సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – నీళ్ల ట్యాంకర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని కందుకూరు వైపు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.