NZB: బీర్కూర్ మండలానికి చెందిన సయ్యద్ ఉస్మాన్ అనే నిరుపేద కుటుంబానికి అరిగే సావిత్రి మానవతా దృక్పథంతో బియ్యాన్ని అందజేశారు. ఉస్మాన్ కూతురి వివాహం కోసం ఈ సహాయం అందించినట్లు, అవసరమైతే మరిన్ని సాయం చేస్తానని అరిగే సావిత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అరిగే ధర్మతేజ, నాయకులు మంగలి రాజు, ఆకుల నవీన్, ముజ్జుబాయ్ తదితరులు పాల్గొన్నారు.