WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల మైనార్టీ కాలనీలో వరద ముంపు, నివాస సమస్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, స్థలం లేనివారికి ప్రభుత్వ భూమి గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల మీదుగా వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్ను మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.