ఉపాధి హామీ పథకాన్ని కాపాడడానికి దేశవ్యాప్త పోరాటం అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండానే పేరు మార్చారని మండిపడ్డారు. పేదల హక్కులను కాలరాచారని విమర్శించారు. పెట్టుబడిదారులను కేంద్రం కాపాడుతోందని విమర్శించారు.