SRCL: కుక్కలు, కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా పాషకు శనివారం వినతిపత్రం అందించారు. మోటార్ సైకిల్‌పై వెళ్తుంటే కుక్కలు వెంబడి పడుతున్నాయన్నారు. వృద్ధులు, చిన్నారులను కోతులు, కుక్కలు కరవడానికి వస్తున్నాయని.. సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.