NLR: సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కావలి పట్టణంలోని 40వ వార్డు శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డ్‌లో నుంచి వచ్చిన ప్రజలతో వినతులను స్వీకరించారు. ప్రజలు నిర్బయంగా తమ సమస్యలను తెలపాలని కోరారు.