W.G: ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు (65) శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గతంలో ఆయన మార్కెట్ ఛైర్మన్గా పనిచేసిన కాలంలో పుంత రోడ్ల అభివృద్ధికి, రైతు సంక్షేమానికి విశేష కృషి చేశారని స్థానికులు స్మరించుకున్నారు.