VZM: గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ వద్ద శనివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బోట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త బాట్లు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.