TG: రాష్ట్రంలో మళ్లీ చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని పేర్కొంటూ.. 13 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. HYDలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కనిష్టానికి పడిపోనున్నట్లు తెలిపింది.