ASF: రెబ్బెన మండలం దేవులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆర్టీసీ డ్రైవర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ గౌడ్ మాట్లాడుతూ.. వెనుక నుంచి వాహనం ఢీకొంటే డ్రైవర్‌ను బాధ్యుడిని చేయడం అన్యాయమన్నారు.