BHNG: ఆలేరు మండలం శర్భనపురం సర్పంచ్‌గా గెలిచిన మొగలగాని నరసయ్యను శుక్రవారం ఆలేరు మాజీ MLA బిక్షమయ్య గౌడ్ HYDలో తన ఆఫీసులో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్, పుట్టిన ఊరికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదన్నారు. సర్పంచ్ పదవి ద్వారా గ్రామ అభివృద్ధి కోసం శ్రమించినప్పుడే గ్రామ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు.