SRPT: బండ రామారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ నరేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో గెలిచిన వెంటనే మొదటి పనిగా మురికి కాల్వలను సిబ్బందితో కలిసి పరిశుభ్రం చేయించి మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.