ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని RTC బస్టాండ్ వద్ద CPI ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న స్థాపించబడిన ఈ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు, త్యాగాలు చేసిందన్నారు.