AP: సినీనటి మాధవీలతపై తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో మాధవీలత తమపై అభాండాలు వేశారని గుర్తు చేశారు. ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తామన్నారు. మాధవీలత, తాము కాంప్రమైజ్ అయ్యామని చెప్పారు.