VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్య స్మరణీయుడని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్ చంద్రబాబు అన్నారు. KLపురంలో నిర్వహించిన సమైక్య తెలుగు దినోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్ళ నేపథ్యంలో వందేమాతరం పైన వివిధ పాఠశాలలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రశంసాపత్రాలను, బహుమతులను అందజేశారు.