AP: RTCలో మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ విధులు కల్పించడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పందించారు. మెడికల్ అన్ఫిట్ ఉద్యోగుల సమస్య పరిష్కరించిన CM చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఎవరూ నష్టపోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తున్నామని వెల్లడించారు.