VSP: పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవల్లోనూ భాగస్వాములు కావాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. శుక్రవారం టూటౌన్ పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.