NLG: సీపీఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడిపల్లిలో శుక్రవారం పార్టీ జెండా ఆవిష్కరించారు. భారత రాజకీయ చరిత్రలో ప్రజల పక్షాన నిలబడి, కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ సీపీఐ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ గ్రామ సెక్రెటరీ యాద ఆంజనేయులు, మోపురి ఆంజనేయులు, గోలి రాములు, గోలి మారయ్య ఉన్నారు.