ADB: గుడిహత్నూర్ గ్రామంలో తాగునీటి సరఫరాకు కీలకమైన మోటార్ దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచ్ షీలా స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. మోటార్ పరిస్థితిని పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు సమస్యలు ఒక్కటిగా వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.