ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. బాక్సింగ్ డే టెస్టులోనూ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 83 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా ఆడుతోంది. బ్రూక్ 41, స్టోక్స్ 16 మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ప్రస్తుతం క్రీజులో అట్కిన్సన్(6), కార్స్(0) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.