కృష్ణా: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం బంటుమిల్లిలో జరిగే రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అర్తమూరు గ్రామంలో సచివాలయం, RSK భవనాలను ప్రారంభిస్తారు. తర్వాత పెడన టీడీపీ కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించి ప్రజల వినతులను స్వీకరిస్తారని పార్టీ కార్యాలయం తెలిపింది.