HYD: హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (SIT) కీలక సమావేశం నిర్వహించింది. సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిట్ బృందంలోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలు, తదుపరి అరెస్టులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.