NTR: గంపలగూడెం మండలంలోని సత్యాలపాడు సత్యాంబకేశ్వర గురుస్థాన్ నుంచి భద్రాచలం వరకు సాగే సీతారాముల పల్లకి పాదయాత్ర గురువారం వైభవంగా ప్రారంభమైంది .భక్తులు కాషాయ జెండాలు ధరించి, భగవన్నామస్మరణ చేస్తూ స్వామివారి ఉత్సవ మూర్తులతో పల్లకిని ముందుకు సాగించారు. ఈ యాత్ర ఈ నెల 29న భద్రాద్రి చేరుకుంటుందని, 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటామన్నారు.