ADB: మాల జాతి ఐక్యత కోసం ఆవుల బాలనాదం చేసిన కృషి అభినందనీయమని మాల సంక్షేమ సంఘం జిల్లాధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. మావల మండల కేంద్రంలోని మాల సంక్షేమ సంఘం భవనంలో స్వర్గీయ ఆవుల బాలనాదం 80వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపించిన మార్గంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.