KRNL: మానవ జీవితానికి పరమార్థం తెలియజేయడానికే యేసుక్రీస్తు జన్మించారని క్రిస్మస్ కారల్ పాస్టర్ రాజరత్నం తెలిపారు. ఎమ్మిగనూరు మండలంలోని కే.తిమ్మాపురం గ్రామంలో పర్యటిస్తూ క్రీస్తు జనన శుభవార్తను ప్రజలకు తెలియజేశారు. విశ్వ మానవాళి యేసు దృష్టిలో సమానులని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు గురువారం తెలిపారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.