AP: మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై వైసీపీ MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘మంత్రి పీఏ వ్యవహారంలో బాధితురాలిపైనే తిరిగి కేసు పెట్టారు. నిందితుడుని వదిలి బాధితురాలిని అరెస్ట్ చేయడం దారుణం. మంత్రి డైరెక్షన్లోనే బాధితురాలిపై కేసు నమోదు చేశారు. ఒక మహిళను మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. ఈ విషయంలో హోంమంత్రిగా అనిత విఫలమయ్యారు’ అంటూ విమర్శించారు.