ఈ రహదారి వెంట నడవాలంటే మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు హడలిపోతున్నారు.ఉండి మండలం చెరుకువాడ గ్రామంలోని సినిమాలు సెంటర్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఈ ప్రాంతానికి కూతవేటుదూరంలోనే బడి, గుడి కూడా ఉన్నాయి. ఏ క్షణంలో గ్రామాసింహలు దాడి చేస్తాయోనన్న భయం అటుగా వెళ్తున్న వారిలో కలుగుతుంది. వీటి బెడద తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.