KRNL: ఆదోని జిల్లా సాధనకు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 40వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి ఆదేశాల మేరకు బీజేపీ మహిళా మోర్చా దీక్షలకు మద్దతు ప్రకటించి పాల్గొంది. కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ.. ఐదు నియోజకవర్గాలకు ఆదోని అనువైన కేంద్రం అని, జిల్లా ఏర్పాటుతో పశ్చిమ కర్నూలు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.