TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. “గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరం. ఆ పాపంలో మేమందరం భాగమే” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు.