W.G: ఆకివీడు వినియోగదారుల సంఘం అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. వినియోగదారుల హక్కుల రక్షణకు ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ విజయవాడలో జరిగిన సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ MD ఢిల్లీ రావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.