AKP: ఎస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం, హోమం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దర్శనం చేసుకుని విశేష పూజలు నిర్వహించారు. టీడీపీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం, పీఏసీఎస్ ఛైర్మన్ గుర్రం రామకృష్ణ, తదితరులు సీతారాములను దర్శించుకున్నారు.